NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ షూటింగ్ పూర్తి.. యూనిట్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చిన మేకర్స్..

Kalki (2)

Kalki (2)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు .ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.దీనితో ఇప్పటి నుంచే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాలోని స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని పరిచయం చేసారు.

Read Also :NAMO : సర్వైవల్ కామెడీ మూవీగా వస్తున్న ‘నమో’.. రిలీజ్ ఎప్పుడంటే..?

హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అయిన బుజ్జి అనే రోబోటిక్ కార్ ను ప్రేక్షకులకు మేకర్స్ పరిచయం చేసారు.ఈ ఈవెంట్ లో బుజ్జిని నడుపుతూ ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.ప్రభాస్ ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే  కల్కి మూవీ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. కల్కి సినిమాకు పనిచేసిన కొందరు టెక్నిషియన్స్ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.షూటింగ్ పూర్తయినందుకు మూవీ యూనిట్ అదిరిపోయే గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్లుగా వారు కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసారు.ఈ గిఫ్ట్స్ లో నాగ్ అశ్విన్ బొమ్మతో మీమ్స్ వేసిన టీ షర్ట్, వెండి కృష్ణుడి బొమ్మ, ఒక చైన్ వంటివి వున్నాయి. ప్రస్తుతం ఈ గిఫ్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.