NTV Telugu Site icon

Kalki 2898 AD : నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో దూసుకుపోతున్న ప్రభాస్ ‘కల్కి’

Kalki (1)

Kalki (1)

Kalki 2898 AD :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరాకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

Read Also :Pushpa 2 : ఈ వారమే స్పెషల్ సాంగ్ పై అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..?

హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AAA క్రియేషన్స్ సొంతం చేసుకుంది.తాజాగా ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీ సేల్స్ $ 1.6M మార్క్ కి చేరుకుంది.తాజాగా ఈ సివిషయాన్నీ తెలియజేస్తూ చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ అమరావతిలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ ఈవెంట్ కు గెస్ట్ లుగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నట్లు సమాచారం.