NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?

Kalki (3)

Kalki (3)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫ్యాన్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Read Also :Gangs of Godavari : విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..?

దీనితో  ఇప్పటి నుంచే మేకర్స్ ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టారు.ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలో బుజ్జి అనే స్పెషల్ క్యారెక్టర్ ను పరిచయం చేసారు.బుజ్జి అంటే ఓ రోబోటిక్ కార్.ఈ సినిమాలో ప్రభాస్ కు బుజ్జి క్లోజ్ ఫ్రెండ్.బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఈ మూవీకి ఎంతో స్పెషల్ అయిన బుజ్జిని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు పరిచయం చేసారు.ఈ ఈవెంట్ తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమా ట్రైలర్ ను జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.