Site icon NTV Telugu

Prabahs Hanu: ఒక బెటాలియన్ మీదడిపోతే ఇలానే ఉంటది సార్

Prahas Hanu

Prahas Hanu

చాలా కాలం నుంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్న ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా నుంచి ఎట్టకేలకు అప్‌డేట్ వచ్చేసింది. ఒకపక్క దీపావళితో పాటు మరోపక్క ప్రభాస్ పుట్టినరోజు కూడా దగ్గరపడిన నేపథ్యంలో, ఎట్టకేలకు సినిమా యూనిట్ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రభాస్ పుట్టినరోజు నేపథ్యంలో ఒక అప్‌డేట్ ఇస్తున్నామని చెబుతూ, ఇది ‘యుద్ధ నేపధ్యంలో’ సాగే సినిమా అనే హింట్ ఇస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read :Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ పవర్ ఫుల్ సినిమా.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఈ పోస్టర్‌లో ప్రభాస్ ముఖం కనిపించడం లేదు కానీ, ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నారు. ముందుగా ఎన్నో తుపాకులు ఎక్కుపెట్టి కనిపిస్తున్నాయి. ‘ఏ ఒంటరిగా ఉన్న బెటాలియన్’ అంటూ ప్రభాస్‌ను సంబోధిస్తున్నారు. అంటే, ఒక బెటాలియన్ మొత్తానికి ఎదురు వెళ్లి యోధుడిగా ఇక్కడ ప్రభాస్‌ను చిత్రీకరిస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాని హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తుండగా, సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్ వి ఇస్మాయిల్ నటిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమాకి ‘ఫౌజి’ అనే టైటిల్ ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు గనుక ఈ పోస్టర్ చూస్తుంటే, నిజంగానే అదే టైటిల్ ఏమో అని అనుమానాలు మొదలయ్యాయి

Exit mobile version