Site icon NTV Telugu

Prabhas: ప్రశాంత్ నీలే హీరోలా ఉన్నాడన్న ప్రభాస్.. పాపాం నీల్ ఏం చేశాడో తెలుసా?

Prabhas Prashanth Neel

Prabhas Prashanth Neel

Prabhas Fun Banter with Prashanth Neel Says he Looks like Hero: ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కలిసి సలార్ అనే సినిమా చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది కూడా. ఇప్పుడు ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఫౌజీ అనే పేరుతో ప్రచారం జరుగుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని, ఎలమంచిలి రవిశంకర్ నిర్మించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్గా జరిగాయి.

Fauji : ఆజాద్ హింద్ ‘ఫౌజీ’గా ప్రభాస్.. ఇదే స్టోరీ లైన్?

ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కూడా హాజరయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వి సైతం ఈ కార్యక్రమానికి హాజరయింది. అయితే ఈ కార్యక్రమంలోనే ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. అదేంటంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ కోసం ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. దీంతో ఆయన కూడా ఈ సినిమా ఓపెనింగ్ కి హాజరయ్యాడు. ప్రశాంత్ నీల్ ని చూసి ప్రభాస్ వెంటనే ఈయనే ఒక హీరోలా ఉన్నాడు అంటూ కామెంట్ చేయగా వెంటనే నీల్ అలర్ట్ అప్పటి వరకు పెట్టుకున్న కళ్లద్దాలు తీసేసి ప్రభాస్ తో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Exit mobile version