Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 15 వరకు ‘ఫౌజీ’ షూటింగ్‌కు ప్రభాస్ బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్లో డార్లింగ్‌కి ఇంకా సుమారు 20 రోజుల వర్క్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయితే దాదాపు ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తి అవుతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం డార్లింగ్ ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినప్పటికీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులకు మాత్రం ఎలాంటి విరామం ఇవ్వడం లేదట. ముఖ్యంగా సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ VFX సంస్థలు ఈ భారీ యాక్షన్ బ్లాక్స్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!