Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్‌లతో ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఇటీవల ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన, ఏమాత్రం గ్యాప్ లేకుండా తన మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది.
తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 3, 2026 నుంచి ప్రభాస్ మళ్లీ ‘ఫౌజీ’ సెట్స్‌లో జాయిన్ కానున్నారట. రీసెంట్‌గా విడుదలైన గ్లింప్స్ అభిమానుల్లో ఈసినిమాపై క్రేజ్‌ను అమాంతం పెంచేయడంతో, ప్రభాస్ రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఈ ఆఖరి షెడ్యూల్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ.700 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‌కి జోడీగా ఇమాన్వి నటిస్తుండగా, బాలీవుడ్ దిగ్గజాలు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రద కీలక పాత్రల్లో మెరవనున్నారని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2027 మార్చి 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

