Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు

Prabhas

Prabhas

ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్‌తో ఫ్లాప్ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇదే ఏడాదిలో సాలిడ్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. . సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా నుండి ఇటీవల ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సరికొత్త హంగామా మొదలుపెట్టారు.

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’కి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం మేకర్స్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగానే ఫ్యాన్స్ #GiveUsFauziUpdateASAP అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ మరియు ప్రమోషనల్ ప్లాన్స్ వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హిట్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ పూర్వం జరిగే ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎలాంటి విరామం లేకుండా శరవేగంగా సాగుతోంది. షూటింగ్ అనుకున్న సమయానికి సజావుగా సాగుతుండటంతో ఇక సినిమా నుండి ఒక భారీ అప్‌డేట్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఈ రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.

×
×
Ad