NTV Telugu Site icon

‘ఆదిపురుష్’ కష్టాలకు ‘హోమం’ చేయనున్నారా?

adipurush

ఓం రౌత్ డైరెక్షన్‌ లో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా రానున్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా సీతగా కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనుండగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ ఎంపికయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య షూటింగ్ కు అడ్డుపడుతూ వస్తుంది. అయితే ఈ కథ శ్రీరాముడుకు సంబంధించిన సబ్జెక్టు కావడంతో ఆ వైపు నుంచి ఏదైనా దోషం ఉందేమోనని అనుమానిస్తున్నారట. దీంతో ఈ సమస్యలను తొలగించుకోవటానికి ఈ సినిమా నిర్మాతలు ఏదన్నా హోమం లాంటిది చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.