నాని గ్యాంగ్ లీడర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం ప్రియాంక అరుళ్ మోహన్. నటన పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన శర్వానంద్ శ్రీకారం మెప్పించలేకపోయింది. కెరీర్ స్టార్టింగ్‌లో వెల్ ఫెర్మామెన్స్ చేయలేకపోయినా ఛాన్సులు మాత్రం ఆగలేదు ఆమెకు. అందులోనూ స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్సులే దక్కించుకుంది. శివకార్తీకేయన్, సూర్య, ధనుష్, జయం రవిలాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది. కానీ ఈ మధ్య కాలంలో మేడమ్‌కు అవకాశాలు తగ్గాయి. ప్లాపుల వల్ల ఆఫర్లు తగ్గాయా అంటే కాదు కుట్ర జరిగిందన్న వాదన వినిపిస్తోంది.
Also Read : HHVM : ఆగస్టు1న వీరమల్లు హిందీ వర్షన్ రిలీజ్.. అవసరమా అధ్యక్షా.?
సరిపోదా శనివారంతో టాలీవుడ్ కంబ్యాక్ హిట్ అందుకున్న ప్రియాంక ప్రజెంట్ ఓజీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటిస్తోంది. అలాగే తమిళంలో రీసెంట్లీ కవిన్ మూవీకి కమిటైంది. ఇవి తప్పా మరో అవకాశం లేదు కాదు లేకుండా చేస్తుందట ఓ పీఆర్ టీం. గతంలో తన ప్రాజెక్స్ కోసం ప్రముఖ పీఆర్ ఏజెన్సీతో టయ్యప్ అయ్యిందట. విజయ్, సమంత, పూజా, కీర్తి, రష్మికతో పాటు అట్లీ, లోకేశ్ కనగరాజ్, హెచ్ వినోద్ లాంటి దర్శకుల తరుఫున వర్క్ చేస్తోందట ఈ ఏజెన్సీ. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఏజెన్సీ పనితీరు నచ్చక డీల్ కాన్సిల్ చేసుకుందట ప్రియాంక. ప్రియాంక డీల్ రద్దు చేసుకోవడంతో గిల్టీగా ఫీలైన పీఆర్ ఏజెన్సీ ఆమెపై నెగిటివ్ క్యాంపైన్ స్టార్ట్ చేసిందన్న కోలీవుడ్‌లో వినిపిస్తోన్న బజ్. సోషల్ మీడియాలో ట్రోల్, యాక్టింగ్‌పై రోస్టింగ్, నెగిటివ్ కామెంట్స్ చేయిస్తుందట. ఈ విషయాన్ని ఆమె ఫ్యాన్స్ తర్వగానే గుర్తించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఆమెకు ఛాన్సులు రావడం లేదని సమాచారం. రీసెంట్లీ జాబిలమ్మ నీకు అంత కోపమా గోల్డెన్ స్పారో సాంగ్‌కు స్టెప్పులేయగా.. అప్పుడు కూడా ఆమె డ్యాన్స్ పై నెగిటివ్ క్యాంపెన్ చేసిందని తెలుస్తోంది. మొత్తానికి ఆమె ఛాన్సులు, మార్కెట్ దెబ్బకొట్టి.. శాడిస్పాక్షన్ పొందుతోంది పీఆర్ ఏజెన్సీ.
