NTV Telugu Site icon

Pawan Kalyan : హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టనున్న పవర్ స్టార్.. ఎప్పుడంటే..?

Harihara Veeramallu

Harihara Veeramallu

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “హరిహర వీరమల్లు”..బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమా మొదలయి ఏళ్ళు గడుస్తున్న సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కాకపోవడంతో ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు.అయితే ఈ సినిమా భారీ సినిమా కావడంతో డేట్స్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉండటం ,అదే సమయంలో పవన్ రాజకీయాలలలో బిజీ గా ఉండటంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.దీనితో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది.

Read Also :NBK 109 : ఎట్టకేలకు మూవీ సెట్ లోకి అడుగు పెట్టిన బాలయ్య.. ఇక మాస్ జాతరే..

తాజాగా ఈ సినిమా ఆగిపోలేదని నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇస్తూ ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసారు.డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత తెలిపారు.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకోవడంతో ఈ సినిమా మిగిలిన షూటింగ్ ఏఎం రత్నం కుమారుడైన జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయనుంది.ప్రస్తుతం పవన్ లైనప్ లో ఓజి ,ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు వున్నాయి.ఈ క్రమంలో తన కాల్ షీట్స్ ముందుగా వీరమల్లు సినిమాకే పవన్ కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోండని పవన్ నుండి కబురు వెళ్లినట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ జూన్ చివరి వారంలో కానీ ,జులై మొదటి వారం లో కానీ మొదలు కానుంది.

Show comments