అటు సినిమాలు ఇటు రాజ్యకీయాలతో పాటు పలు రకాల కారణాలతో పవన్ కళ్యాణ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఎన్నికల హడావిడి ముగిసిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న సినిమాల సంగతేంటి,స్ సగంలో ఆగిపోయిన సినిమాలను కంప్లీట్ చేస్తాడా లేదా అని అందిరిలోను అనుమానులు రేగాయి.
Also Read: NagaChaitanya : నేడే అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్..పెళ్లికూతురు ఎవరంటే..?
పవన్ నటించిన మూడు సినిమాల షూటింగ్ మధ్యలో ఉండిపోయాయి. వాటిలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన OG( ఒరిజినల్ గ్యాంగ్ స్టార్) ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సీన్స్ కు సంబంధించి కేవలం పది రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇందుకోసమై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు ‘OG’ నిర్మాత dvv దానయ్య. అక్టోబరు నుండి షూటింగ్ లో పాల్గొంటానని అందుకుకోసం ఏర్పాట్లు చేసుకోమని నిర్మాతకు హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆ పనుల్లో వున్నారు దానయ్య. అక్టోబరు నుండి అటు రాజకీయాలు, సినిమాలు రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు పవర్ స్టార్. మరోవైపు హార హార వీరమల్లు నిర్మాత AM. రత్నం కూడా పవన్ కళ్యాణ్ ను కలవగా ముందు OG ముగించి, పరిపాలన పరంగా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుని షూటింగ్ లో పాల్గొంటానని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా అప్పుడెప్పుడో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టార్ట్ చేసి ఆపేసాడు. మరి పవన్ ఈ సినిమాను స్టార్ట్ చేస్తారో లేదో చూడాలి.