పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది.
Also Read : Karthi : అన్నగారు వస్తారు.. డేట్ ఫిక్స్.. ఈసారైనా వస్తారా ?
చాలా కలాంగా హిట్ లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా OG. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు రాబట్టి పవర్ స్టార్ కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సుజీత్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. తన అభిమాన నటుడు ప్రేమతో ఇచ్చిన కానుకను అందుకున్న దర్శకుడు సుజిత్’ నాకు ఇప్పటివరకు లభించిన అత్యుత్తమ బహుమతి. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంతగా ప్రేమతో నిండిపోయింది. నా ఫెవరెట్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రేమ, ప్రోత్సాహం మరువలేనిది నా చిన్ననాటి నుండి ఆయనను ఆరాధిస్తూ పెరిగాను ఇప్పుడు ఆయన చేతులమీదుగా గిఫ్ట్ అందుకుకోవడం నాకు ఒక ప్రత్యేక అనుభూతి. నేను ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
