Pourusham : ఆడవాళ్లు లేకుండా మగవాళ్ళు లేరనే పాయింట్’తో పౌరుషం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా “పౌరుషం – ది మ్యాన్‌హుడ్” మార్చ్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మించగా సుమన్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వుకార్తిక్, జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ వంటి వారు నటిస్తున్నారు. చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం షేరాజ్ మెహ్దీ అందించారు.
ఇక ఈ ఈవెంట్లో హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు షెరాజ్ మెహ్ది మాట్లాడుతూ.. ‘ఇది నా మనసులోంచి వచ్చిన కథ. ఈ సినిమాలో సీన్స్, యాక్షన్స్, ఎమోషన్స్ నిద్రలో లేపి అడిగినా చెప్తాను. అంత బాగా తెలుసు. ఇంతకు ముందు 8 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశా, ఇది తొమ్మిదో సినిమా. ఇది నేను నా కళ్ళతో చూసిన కథ. ఒకరి వల్ల మంచి వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనే మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. అలాగే కమర్షియల్ సినిమా కూడా. సినిమాలో రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అన్ని ఉన్నాయి. హీరోయిన్ కనికా చాలా డిసిప్లిన్ ఉన్న అమ్మాయి. చాలా బాగా నటించింది. నటి మధి చిన్న ఏజ్ లోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. రవి వర్మ, సుమన్ తల్వార్, జబర్దస్త్ నటీనటులు.. అందరు నటీనటులు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఈ సినిమా ప్రతి అమ్మాయికి అంకితం. మార్చి 8 ఉమెన్స్ డే. ఒక రోజు ముందే ఇది రిలీజవుతోంది. ప్రపంచంలో ఆడవాళ్లు లేకుండా మగవాళ్ళు లేరు. వాళ్ళ సపోర్ట్ తో మనం ముందుకెళ్లాలి అని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ పౌరుషం సినిమా. పౌరుషంగా ఉంటుంది అని అన్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!