Site icon NTV Telugu

Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ డిస్మిస్

Posani

Posani

పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ ను జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ డిస్మిస్ చేశారు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని 6వ తేదీ జే ఎఫ్ సీఎం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ క్రమంలో 7వ తేదీ ఆదోని కోర్టులో కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది మేజిస్ట్రేట్ కోర్టు. ఇక ఇవాళ పిటిషన్ డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పారు. ఇక కాసేపట్లో బెయిల్ పిటిషన్ పై కూడా తీర్పు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. పోసాని బెయిల్ పిటిషన్ పై నాలుగు రోజులపాటు విచారణ కొనసాగింది.

Ranya Rao: డీఆర్ఐ అధికారులు నన్ను తిట్టారు.. వేధించారు

గత ప్రభుత్వంలో పోసాని ఏపీ ఫిలిం టెలివిజన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోపాటు వారి కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై పలువురు కంప్లైంట్స్ చేశారు. దీంతో పోసానిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Exit mobile version