Operation Arunareddy : జూలై 17న పోసాని కృష్ణమురళి ‘ఆపరేషన్ అరుణారెడ్డి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన సినిమాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ పోసాని కృష్ణమురళి. తాజాగా ఆయన ఆల్‌రౌండ్ బాధ్యతలు నిర్వహిస్తూ తెరకెక్కించిన వినూత్న చిత్రం “ఆపరేషన్ అరుణారెడ్డి”. ‘3 ఇడియట్స్ మూవీస్’ సమర్పణలో, ‘యుపి సినిమా లైన్స్’ మరియు ‘కుసుమ ఎంటర్ టైన్ మెంట్స్’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.
ఈ చిత్రానికి పోసాని కేవలం నటుడు, దర్శకుడు, నిర్మాత మాత్రమే కాదు.. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే స్వయంగా చూసుకోవడం విశేషం. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. “రచయితగా వంద సినిమాలు రాశాను, నటుడిగా వందలాది చిత్రాల్లో అలరించాను. కానీ, నా కెరీర్లోనే అత్యుత్తమ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ అని గర్వంగా చెప్పగలను. మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు ప్రేక్షకుడు ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. ఒక్క అసభ్యకర సన్నివేశం గానీ, బూతు మాట గానీ లేకుండా క్లీన్‌గా, ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నా మిత్రుడు, నిర్మాత శ్రీనివాస్ అందించిన సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరగా పూర్తయి విడుదలకు సిద్ధమైంది” అని అన్నారు. బీజేపీ నాయకుడు రఘునందన్ రావు, ఆయేషా భాను, సాయి మణికంఠ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ విలక్షణ చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పోసాని కృష్ణమురళి మార్క్ డైలాగ్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!