Site icon NTV Telugu

Poonam Kaur : జానీ మాస్టర్ ని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు..

Untitled Design (43)

Untitled Design (43)

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని జానీ దగ్గర పని చేసే అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అవుట్‌డోర్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లోవెళ్ళినప్పుడు  తనపై అత్యాచారం చేసాడని, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది కొరియోగ్రాఫర్‌. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడు’ అని బాధితురాలు తెలిపింది.

Also Read : Allu Arjun : పుష్ప -2 తర్వాత బన్నీసినిమా ఆ దర్శకుడితోనే..

తాజగా ఈ వివాదంపై స్పందించింది. ప్రముఖ నటి పూనమ్ కౌర్ తన వ్యక్తిగత ‘X’ ఖాతాలో ” జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న షేక్ జానీని ఇక నుంచి జానీ మాస్టర్ అని పిలవొద్దు. మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉంది. దానికి కాస్త గౌరవం ఇవ్వండి” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు జానీ మాస్టర్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిరిస్తున్నారు. జానీపై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉండాల్సిందని ఇప్పటికే జనసేన అధిష్టానంఆదేశాలు జారీ చేసింది. కొరియోగ్రాఫర్ అసోషియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్లు. ప్రస్తుతం జానీ మాస్టర్ ఎవరికి అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version