Site icon NTV Telugu

Pooja Hegde : ఈ సారి టిల్లుకి జోడిగా బుట్టబొమ్మ..?

Whatsapp Image 2024 05 02 At 10.03.23 Am

Whatsapp Image 2024 05 02 At 10.03.23 Am

 

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకు ప్రస్తుతం అదృష్టం కలిసి రావడం లేదు.. ఈ భామ నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చి ఫ్రీ టైం తన కుటుంబంతో హ్యాపీగా గడిపేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు సమాచారం.టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టిల్లు హీరో సిద్దు తనదైన కామెడీతో అదరగొట్టాడు .అలాగే ఈ సినిమాలో మెయిన్ హైలైట్ రాధికా పాత్ర .ఈసినిమాలో రాధికా పాత్రలో యంగ్ హీరోయిన్ నేహా శెట్టి అదరగొట్టింది .తన హాట్ అందాలతో యూత్ లో పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది .

డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టిల్లు స్వేర్‌ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది .ఈ సినిమాలో అనుపమ హాట్ షో తో అదరగొట్టింది .అనుపమ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .టిల్లు స్క్వేర్ మూవీ ఏకంగా రూ.125 కోట్ల కలెక్షన్స్ సాధించి సిద్దు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇదిలా ఉంటే ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు . తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం. డీజే టిల్లు, టిల్లు స్వేర్‌ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో పార్ట్ లో పూజహెగ్డేను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని సమాచారం .అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Exit mobile version