తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను అని తెలుపుతూ ఈమధ్య తనని కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని రిక్వెస్ట్ చేసాడు. తనకుబాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ తప్పనిసరిగా తమ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలని బన్నీ కోరాడు. దీంతో ఆయన అభిమానులు, సెలెబ్రిటీలు అల్లు అర్జున్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకు కూడా ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుట్టబొమ్మ పూజాహెగ్డే చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేసింది. ‘అమూల్యకు బంటూ కంపెనీ ఇస్తున్నట్టుగా కన్పిస్తోంది. టేక్ కేర్ అల్లు అర్జున్’ అంటూ ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించిన పాత్రలను గుర్తుకు తెచ్చింది పూజ. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో అల్లు అర్జున్ బంటూ పాత్రలో, పూజాహెగ్డే అమూల్య పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అమూల్యకు బంటూ కంపెనీ …!!?
