Site icon NTV Telugu

కరోనా నుంచి కోలుకున్న పూజా హెగ్డే

Pooja Hegde Tests Negetive for Covid-19

బుట్టబొమ్మ పూజా హెగ్డే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ కరోనా నుంచి కోలుకుంది. ఈ విషయాన్ని పూజ స్వయంగా తన ఇన్స్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. “మీ ప్రేమకు ధన్యవాదాలు. నేను కోలుకున్నాను. చివరకు నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. మీ విషెస్ మరియు హీలింగ్ ఎనర్జీ అంతా ఇంద్రజాలం చేసినట్లు అనిపించింది. సురక్షితంగా ఉండండి” అంటూ నవ్వుతూ ఉన్న సెల్ఫీని పోస్ట్ చేసింది పూజా. ఏప్రిల్ 26న కరోనా సోకినట్లు ప్రకటించింది పూజాహెగ్డే. ఇక ఈ బ్యూటీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది జూలై 30 న తెరపైకి రానుంది.

Exit mobile version