Site icon NTV Telugu

“రాధే శ్యామ్” రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన పూజాహెగ్డే

Pooja Hegde Shocking Remuneration for her Next Movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ మూవీలో వీరిద్దరూ మొదటిసారి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. సినిమా రిలీజ్ డేట్ పై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పూజాహెగ్డే సినిమా విడుదల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్డేట్ ఇచ్చింది.

Read Also : తమ్ముడిని ప్రోత్సహించమంటున్న నాగశౌర్య!

పూజా హెగ్డే మాట్లాడుతూ “ఇంకా కొంతభాగం షూటింగ్ మిగిలి ఉంది. పెండింగ్‌లో ఉన్న ‘రాధే శ్యామ్’ షూట్ 7 నుంచి 10 రోజుల్లో చుట్టబడుతుంది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్న తరువాతే నిర్మాతలు సినిమా విడుదల తేదీపై నిర్ణయం తీసుకుంటారు” అని వెల్లడించారు. ఇటీవల ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వస్తూ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించాడు. అయితే ప్రభాస్ ఇటలీ పర్యటన వెనుక గల కారణం ఏమిటో తెలియదు. అయితే “రాధే శ్యామ్” కోసం కొన్ని ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ కోసమే వెళ్లి ఉండొచ్చు అని కూడా అంటున్నారు.

Exit mobile version