టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి మంచి మార్కెట్ ఏర్పర్చుకుంది. కానీ వరుస అవకాశాలతో పాటుగా వరుస డిజాస్టర్స్ కూడా తలెత్తడంతో ఈ అమ్మడు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. దీంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడు వరుస చిత్రాలు ఒప్పుకుంది పూజ . ఇందులో తాజాగా ‘రెట్రో’ మూవీ రిలీజ్ అయ్యింది. కానీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది.
లుక్ మార్చి ఇందులో పూజ డి గ్లామరస్ గా కనిపించినప్పటికి చివరికి నిరాశే మిగిలింది. విడుదల తర్వాత సినిమాపై వచ్చిన రివ్యూలు, కలెక్షన్లు చూస్తే పూజకి గట్టి దెబ్బ తగిలింది అనిపిస్తుంది. ఇక ‘రెట్రో’ తో కలిపి వరుసగా ఏడవ ఫ్లాప్‌ను మూటగట్టుకుని పూజా హెగ్డే . ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’, ‘దేవా’ వంటి భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలిచి పూజా ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయి. పాపం ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్‌గా నిలిచిన పూజా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. పూజా కెరీర్ మళ్లీ ఊపందుకోవాలంటే, కథలో బలమున్న సినిమాలు, టాలెంట్ రివీల్ చేసే పాత్రలు చేస్తే కానీ లాభం లేదు.. ఇక ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. అలాగే విజయ్‌తో చేస్తున్న ‘జన నాయకన్’ మూవీతో అయినా హిట్ కొడుతుందో లేదో చూడాలి.
