సినీ హీరో మంచు విష్ణుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేరేడు మెట్ లోని రాచకొండ సీపీ కార్యాలయానికి మంచు విష్ణు వెళ్లారు. స్వతహాగా తన ఎదుట విచారణ హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసు ఇవ్వడంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో మరోసారి గొడవలు జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని సమాచారం. నాలుగు రోజులుగా కుటుంబంలో నెలకొన్న వివాదంపై సీపీ విష్ణు వద్ద ఆరా తీశారు. జల్పల్లి నివాసం నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలని విష్ణును సీపీ ఆదేశించారు. ఇంటి వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
Pushpa 2: దొంగలు కూడా ‘‘తగ్గేదే లే’’.. పుష్ప 2 సినిమా హాలులో దోపిడి..
శాంతి భద్రతలు విఘాత కలిగించేలా వ్యవహరిస్తే లక్ష రూపాయల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ క్రమంలో మనోజ్ ఫిర్యాదుపై కూడా విష్ణును విచారించినట్లు తెలుస్తోంది. జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్ పై సైన్ కూడా తీసుకున్నారు సీపీ సుధీర్ బాబు. తమ ముందు హాజరు కావాలని మోహన్ బాబు రాచకొండ పోలీసులు ఆదేశించగా పోలీసుల నోటీసులను హైకోర్టులో సవాల్ చేయడంతో డిసెంబర్ 24వ తేదీ వరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇక ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్ లో మోహన్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.