NTV Telugu Site icon

Jani Master: జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ వద్దు.. కస్టడీ పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు

Jani Master Custody

Jani Master Custody

Police to Take Jani Master into Custody: జానీ మాస్టర్ పొస్కో కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తనను మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు అంటూ ఆయన వద్ద పనిచేసే ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ రేప్ కేసు కావడంతో ఆయన్ను గోవాలో పరారీలో ఉండగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఈ కేసులో ఆయనను విచారించాలని పోలీసులు కస్టడీ కోరారు.. నిన్ననే వాదనలు పూర్తికాగా నేటికి తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు..ఇక తాజాగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి 28వ తేదీ సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల వరకు జానీ మాస్టర్‌కకు పోలీస్ కస్టడీ ఇస్తూ ఆ తీర్పు వెలువరించారు.

Badlapur Encounter: ‘‘ఇది ఎన్‌కౌంటర్ కాదు’’.. బద్లాపూర్ కేసులో హైకోర్టు ఆగ్రహం..

28వ తేదీ సాయంత్రం నాలుగున్నరకు జానీ మాస్టర్ ను కోర్టులో హాజరు పరచాలి అని ఆదేశాలు జారీ చేశారు. కోర్టుకు తీసుకొచ్చే ముందు మెడికల్ టెస్ట్‌లు చేపించి ఆ రిపోర్ట్‌లను సైతం కోర్టులో సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించారు. జానీ మాస్టర్ ను కస్టడికి అప్పగించే ముందు మెడికల్ టెస్ట్ లు చేపించాలంటూ కూడా చంచల్గూడా సూపరిండెంట్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జానీ మాస్టర్ పై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదు అని పేర్కొన్న కోర్టు అవసరమైనప్పుడు జానీ మాస్టర్ అడ్వకేట్ ను కస్టడీలో విచారించే ముందు అనుమతించాలి అని కూడా పేర్కొంది.

Show comments