Site icon NTV Telugu

Police Complaint: ఉత్కంఠ రేపుతున్న ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్

Police Compl

Police Compl

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వరలక్ష్మి శరత్‌కుమార్, టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. హారర్ థ్రిల్లర్ అంశాలకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్‌మెంట్ జోడించి దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా తెలుగు, కన్నడ టీజర్ లాంచ్ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.

సాధారణంగా వరలక్ష్మి శరత్‌కుమార్ అంటే పవర్‌ఫుల్ విలనీ లేదా గంభీరమైన పాత్రలు గుర్తుకు వస్తాయి. కానీ ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రంలో ఆమె తొలిసారిగా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రేమ, పగ, మంచి-చెడుల మధ్య జరిగే ఒక ఆసక్తికరమైన పోరాటమే ఈ సినిమా. కేవలం హారర్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ప్రతి నిమిషం థ్రిల్ చేసే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరో నవీన్ చంద్ర ఇందులో ఒక బలమైన పాత్రలో నటించారు. ఆయన మార్క్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ఒక కీలకమైన పాత్రలో నటించి థ్రిల్ పంచబోతున్నారు. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు ఇందులో నటిస్తున్నారు. ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ అందించిన ఫైట్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ తెలిపింది. దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ చిత్రాన్ని ఒకే భాషకు పరిమితం చేయకుండా తెలుగు, తమిళం, మలయాళం, మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. కథలో ఉన్న సార్వజనీనత ప్రతి భాషా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్ముతున్నారు.

Exit mobile version