దినేష్ తేజ్, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ డ్రామా ‘ప్లే బ్యాక్’. అర్జున్ కళ్యాణ్, స్పందన, కార్తికేయ కృష్ణ మల్లాడి, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, మూర్తి, చక్రపాణి ఆనంద, ఐశ్వర్య లక్ష్మి, తగుబోటు రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో ప్రసాద్రావు పెద్దినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. కమ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. క్రాస్ కనెక్షన్ అనే సరికొత్త లైన్‌తో రూపొందిన ఈ థ్రిల్లర్ డ్రామా ఇప్పుడు ఓటిటిలో విడుదల కాబోతోంది. మే 21 నుంచి తెలుగు ఓటిటి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇంట్లో కూర్చునే ‘ప్లే బ్యాక్’ చిత్రాన్ని వీక్షించొచ్చు.