Site icon NTV Telugu

Peter Teaser : జెస్సీ మళ్లీ వచ్చింది.. ఆసక్తికరంగా ‘పీటర్’ టీజర్

Peter

Peter

సస్పెన్స్, థ్రిల్లర్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌ జానర్. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘పీటర్’. ఇందులో రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. గురువారం నాడు మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం.. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను’ అంటూ సాగిన టీజర్ ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది.

Also Read :Champion : ‘ఛాంపియన్’ టీజర్..ఇదేదో గట్టిగా కొట్టేట్టు ఉందే!

‘పీటర్’ టీజర్‌ను గమనిస్తే కేరళ సంప్రదాయం, కేరళ అందాల్ని అద్భుతంగా చూపించినట్టు కనిపిస్తోంది. టీజర్ కట్ చేసిన విధానం చూస్తుంటే.. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో మరో అద్భుతమైన చిత్రం రానున్నట్టుగా అనిపిస్తోంది. ఈ టీజర్‌లో చూపించిన విజువల్స్, భయపెట్టేలా చూపించిన కెమెరా యాంగిల్స్, వెంటాడే నేపథ్య సంగీతం అన్నీ కూడా హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. పీటర్ కథ ఏంటి? జెస్సీ ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలకు త్వరలోనే సమాధానం రానుంది. ‘పీటర్’ త్వరలోనే రిలీజ్‌ కానుంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఇతర అప్డేట్‌లను మేకర్లను త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version