భారీ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ రోజు తమ లైనప్ చిత్రాలను రాబోయే రోజుల్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో అక్షయ్ కుమార్ “బెల్ బాటమ్”, అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి”, రణ్‌వీర్ సింగ్ నటించిన తమిళ చిత్రం “అన్నియన్” రీమేక్, జాన్ అబ్రహం తదుపరి చిత్రం “అటాక్”, తెలుగు మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” ఉన్నాయి. “బెల్ బాటమ్” జూలై 27 న సినిమాహాళ్లలోకి వస్తుందని ముందే ప్రకటించారు. జయంతి లాల్ గడా ఆధ్వర్యంలోని పెన్ స్టూడియో వారి తదుపరి లైనప్ చిత్రాలను ప్రకటించడానికి ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
Also Read : సెకండ్ వేవ్ తరువాత ఫస్ట్ బిగ్ రిలీజ్ ఈ స్టార్ హీరో మూవీనే ?
ఈ వీడియోలో బెల్ బాటమ్, గంగూబాయి కతియావాడి, అన్నీయన్ రీమేక్, ఎటాక్, ఆర్‌ఆర్‌ఆర్ వంటి చిత్రాలు త్వరలో థియేటర్లలో విడుదల కానున్నాయి. అంటూ #BackToTheatre అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ఈ చిత్రాల విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా ఎఫెక్ట్ తగ్గుతుండడంతో థియేటర్లు త్వరలోనే రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలన్నీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించనున్నాయి. పెన్ స్టూడియోస్ వారి ప్రకటన సినీ ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
Dr. Jayantilal Gada (Pen Studios) introduces us to their impressive line-up this year. The studio is gearing up for their massive slate release, in cinemas near you.#BackToTheatres @penmovies @jayantilalgada #gangubaikathiawadi #BellBottom #rrrmovie #Attack@bhansali_produc pic.twitter.com/GNpyVsZ0g6
— BA Raju's Team (@baraju_SuperHit) June 17, 2021