మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రైట్స్ కోసం ఇండస్ట్రీలో విపరీతమైన పోటీ నెలకొంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఇటీవలే మళ్లీ ధృవీకరించినట్లుగా, మార్చి 27, 2026న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి సింగిల్ ‘చికిరి’ అన్ని భాషల్లోనూ ఇన్స్టాంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
Also Read:Bollywood : హిట్ కొట్టి రెండేళ్లు.. ఇలా అయితే ఎలా పాప
‘పెద్ది’ నిర్మాతలు ఇప్పటికే నాన్-థియేట్రికల్ డీల్స్ (ఓటీటీ, శాటిలైట్) ను విజయవంతంగా క్లోజ్ చేశారు. అయితే, థియేట్రికల్ రైట్స్ పొందడానికి డిస్ట్రిబ్యూటర్ల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ, నిర్మాతలు మాత్రం ‘నో టెన్షన్ మోడ్’ లో ఉన్నారు. సినిమా విడుదల కావడానికి ఇంకా సమయం ఉన్నందున, థియేట్రికల్ డీల్స్‌ను క్లోజ్ చేయడానికి ఎలాంటి తొందరపాటు చూపడం లేదు. థియేటర్ రైట్స్ అమ్మకం 2026 సంక్రాంతి తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్లు దాదాపుగా ఖరారు అయినప్పటికీ, అగ్రిమెంట్లు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఈ భారీ బడ్జెట్ సినిమాతో వెంకట సతీష్ కిలారు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయన మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు కీలక ఫైనాన్షియర్‌గా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా ‘పెద్ది’ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ‘పెద్ది’, రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
