ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే భారీ హైప్‌ను సెట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ లో చాలామంది క్రేజీ స్టార్‌లు భాగమవుతున్నారు. వారిలో ఓటిటిలో సంచలనంగా నిలిచిన ‘మిర్జాపూర్’ సిరీస్ ఫేమ్.. మున్నా భయ్యా అంటేనే గుర్తుకు వచ్చే దివ్యేంద్ర శర్మ కూడా ఉన్నారు.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ కి ఫైనల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడంటే?
కాగా ఈ సినిమాలో దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన అతడి ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన రాబట్టింది. తాజాగా మేకర్స్ మున్నా భయ్యా పుట్టినరోజు సందర్భంగా మరో స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో దివ్యేంద్ర క్రికెట్ బాల్ పట్టుకుని మాస్ లుక్‌లో పవర్‌ఫుల్ అవతారంలో కనిపిస్తున్నాడు. కాగా అతను ఈ సినిమాలో ‘రామ్ బుజ్జి’ అనే పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండగా ఫ్యాన్స్‌లో హైప్ పెంచేస్తోంది. ఈ భారీ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న గ్రాండ్‌గా విడుదల కానుంది.
