రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో బుచ్చిబాబు ఉప్పెన అనే సినిమా చేశాడు. అదే బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఈ పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. సరిగ్గా ఐపీఎల్ సీజన్‌లో వదిలిన క్రికెట్ షాట్ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.
Ambati Rambabu: సీమరాజా, కిర్రాక్ ఆర్పీలపై అంబటి రాంబాబు ఫిర్యాదు
ఆ సంగతి అలా ఉంచితే, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ మౌలాలిలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో జరుగుతోంది. నిజానికి షెడ్యూల్ గ్యాప్ ఇచ్చారని ప్రచారం జరిగింది. తదుపరి షెడ్యూల్ జూన్ నెల నుంచి ఎండలు తగ్గాక మొదలు పెడతారని కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ రోజు షూట్ హైదరాబాద్‌లో జరగడం గమనార్హం. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారుతో పాటు ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సహనిర్మాణం చేస్తోంది.
