Site icon NTV Telugu

PEDDI : ‘పెద్ది’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ .. ఇండియన్ సినిమాకు న్యూ బెంచ్‌మార్క్?

Peddi Movie Update, Ram Charan

Peddi Movie Update, Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ టైటిల్ ప్రకటనతో పాటు విడుదలైన రెండు ఫస్ట్‌లుక్ పోస్టర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. జాతీయ అవార్డు గ్రహీత, “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, విజనరీ నిర్మాత వెంకట సతీష్ కిలారు తన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Also Read : Samantha : సమంతకు ఏమైంది.. ఇంత సన్నగా మారిపోయిందేంటి..?

తాజా సమాచారం మేరకు, “పెద్ది” సినిమా యొక్క తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జోరుగా కొనసాగుతోంది. ఈ భాగంలో, భారతీయ సినిమాలలో ఇప్పటివరకు చూసిన అత్యంత సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలలో ఒకటిని చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా ఒక భారీ రైలు సెట్ను నిర్మించారు. ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఇటువంటి స్కేల్లో రైలు సెటప్ ను చాలా అరుదుగా చూసాం. ఈ సెట్లో షూటింగ్ జరుగుతున్న యాక్షన్ సన్నివేశాలు పూర్తి స్థాయిలో హై-రిస్క్, హై-ఆక్టేన్ ఫీలింగ్‌ను కలిగించేలా ఉంటాయని సమాచారం. అయితే ఈ యాక్షన్ సీన్‌కి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నాభకాంత్ మాస్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పుష్ప 2’ లో చేసిన యాక్షన్ సీన్‌లకు ఆయన దక్కిన ప్రశంసల నేపథ్యంలో, ‘పెద్ది’లో కూడా మరోసారి తన టాలెంట్‌ను చూపించబోతున్నారు. ఇక రామ్‌చరణ్ పాల్గొన్న ఈ హై-రిస్క్, హై-ఆక్టేన్ స్టంట్, భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జూన్ 19 వరకు కొనసాగనుంది.

Exit mobile version