Site icon NTV Telugu

Peddi : ‘పెద్ది’ మూవీపై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Pedhi Movie

Pedhi Movie

‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా ద‌ర్శక‌త్వంలో, రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ న‌టిస్తుండ‌గా, కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కీల‌క పాత్రలో క‌నిపించ‌నున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Also Read: Aamir Khen : బాలీవుడ్ నుండి మరో భారీ ప్రజెక్ట్.. అదిరి పోయే అప్ డేట్ ఇచ్చిన ఆమిర్ ఖాన్

ఇక శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్‌ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా. ఈ గ్లింప్స్ ప్రతి ఒక్కరిని ఆక‌ట్టుకుంది. మాస్ అవతార్ లో చరణ్ క‌నిపించ‌గా ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అద‌ర‌గొట్టాడు. ఇక గ్లింప్స్ చివ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్ క్రికెట్ షాట్ ఒక‌టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుచ్చి బాబు ఈ మూవీకి సంబంధించిన విషయాలు పంచుకున్నాడు.

‘ ‘పెద్ద’ మూవీ గ్లింప్స్ రిలీజ్ రోజు నేను చ‌ర‌ణ్ ఇంట్లోనే ఉన్నా. చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారు. ఆయనకు న‌చ్చుతుందా లేదా అని చాలా టెన్షన్ ప‌డ్డాను. కానీ చూశాక చిరంజీవి గారు చాలా ఎగ్జైట్ అయ్యారు చరణ్ లుక్  ఆయనకు విపరీతంగా నచ్చింది. కరోనా టైమ్ లో ‘పెద్ది’ ఆలోచ‌న వ‌చ్చింది నాకు. స్క్రిప్ట్ పూర్తి చేశాక సుకుమార్ గారికి వినిపిస్తే బాగుంది అని అన్నారు. రామ్ చ‌ర‌ణ్‌కి క‌థ వినిపించు.. కాన్సెప్ట్, క్యారెక్టరైజేష‌న్ చ‌ర‌ణ్‌కి బాగా నచ్చుతాయి అని అన్నారు. అలా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది’ అని బుచ్చిబాబు పేర్కొన్నారు.

Exit mobile version