Site icon NTV Telugu

‘బంగార్రాజు’’లో ఐటమ్ సాంగ్.. పాయల్ క్లారిటీ

టాలీవుడ్ కింగ్​ నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకు ప్రీక్వెల్​ గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్​కృష్ణ రూపొందించనున్న విషయం తెలిసిందే.. ఇందులో ఐటెం సాంగ్ కోసం ‘ఆర్‌ఎక్స్ 100’ భామ పాయల్​ రాజ్​పుత్​ను సంప్రదించినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన పాయల్ తాను ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. కాగా లాక్‌డౌన్‌ తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి సంక్రాంతికి విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారని చెబుతున్నారు.

Exit mobile version