ప్రస్తుతం ఉన్న వేతనాలకు 30% పెంచాలని ఫిలిం ఫెడరేషన్ నిర్మాతలకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఎవరైతే 30% వేతనాలు పెంచి ఇస్తారో, వారికి మాత్రమే షూటింగ్‌కి వెళ్లాలని ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌ను మాత్రం ముంబయి, చెన్నై టెక్నీషియన్లతో నిర్వహించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకటమే గగనమైపోయిన పరిస్థితి. ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ బంద్‌కు దిగితే మరింత ఇబ్బంది వస్తుందనేది వారి ఆలోచన. అందుకే వారు షూటింగ్‌ను కొనసాగిస్తున్నారు.
Also Read : Dulquer Salmaan : దుల్కర్ తో సినిమా మొదలెట్టిన దసరా నిర్మాత
ఈ విషయం తెలుసుకున్న కొంతమంది తెలుగు సినీ ఫెడరేషన్ సభ్యులు, షూటింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్నపూర్ణ 7 యాకర్స్ స్టూడియోలో జరుగుతున్న సినిమా పాట చిత్రీకరణను నిలిపివేయాలని ప్రయత్నించారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. ఈ సంఘటన పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో, పలువురు నిర్మాతలు ఆయనను కలిసి మొత్తం వ్యవహారాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. త్వరలో పవన్‌ను కలిసి ఈ విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు. ఫెడరేషన్ పేర్కొన్న డిమాండ్లకు నిర్మాతలు ఒప్పుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై లేబర్ కమిషనర్‌తో కూడా భేటీ కానున్నారు సినీ నిర్మాతలు.
