Site icon NTV Telugu

OG : “ఓజీ లాస్ట్ షెడ్యూల్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి బిగ్ అప్‌డేట్!”

Og

Og

అగ్ర హీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘ఓజీ’ ఒకటి. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే సినిమా పోస్టర్లు, గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. ఇక ఇటీవల విడుదలైన OG చిత్రం మొదటి పాట Fire Storm విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. OG థీమ్ సాంగ్ గా సాగిన పాట లిరిక్స్, థమన్ అందించిన క్యాచీ ట్యూన్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం మేకర్స్ 2వ పాటను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా సమాచారం ప్రకారం..

Also Read : Upasana : హోదా కాదు, కీర్తి కాదు.. నన్ను నేను నిలబెట్టిన శక్తి ఇదే

ఈ సినిమాకు సంబంధించి కేవలం నాలుగు రోజుల షూటింగ్‌ మాత్రమే బ్యాలన్స్‌ ఉందని, త్వరలో పవన్‌కల్యాణ్‌ ఈ షూట్‌లో పాల్గొంటారని చెబుతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం వరుస చిత్రాలతో అభిమానుకు ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ఇటు ప్రియాంక కెరీర్ కూడా ఓ గడిలో పడటం కాయం. ఫ్యాన్స్ కోసం ఇదే ఒక బుస్ట్ అప్‌డేట్, పవన్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ‘ఓజీ’ ఈ దసరాకు స్పెషల్ ట్రీట్ అవ్వనుంది.

Exit mobile version