OG : విడుదలకు ముందే రికార్డుల వేట మొదలెట్టిన ఓజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంకా ట్రైలర్ కూడా విడుదల కాకముందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన చిత్రం ‘ఓజీ’ ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ, తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్ డాలర్లను రాబట్టి, ఈ సంచలనాత్మక ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ‘ఓజీ’ తుఫానుతో మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సరి చేస్తున్నారు. అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాలు సైతం పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న సరికొత్త రికార్డుల పట్ల ఆసక్తిగా ఉన్నారు.
Also Read : NBK : అఖండ – 2 రిలీజ్ డేట్ వచ్చేస్తోంది.. ఇక మాస్ విధ్వంసమే
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మూడు వారాల ముందే.. ఓజీగా ఆయన బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. ఆకలితో ఉన్న చిరుతపులిలా, పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా రికార్డులను వేటాడుతున్నారు. ఓజీ చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘ఓజీ’ వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, మైలురాయి చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read : Ghaati : స్వీటీ కోసం రంగంలోకి ప్రభాస్.. దేవసేన కోసం ఏంచేసాడంటే?
పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న ‘ఓజీ’ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి అద్భుతమైన తారాగణం ఉన్నారు. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ‘ఓజీ’ అనే శక్తివంతమైన టైటిల్ కి తగ్గట్టుగానే.. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ తుఫాను సృష్టిస్తున్నారు. త్వరలోనే ఈ తుఫాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!