టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ఆరు అడుగుల ఆజానుబాహుడి గురించి చర్చ సాగుతోంది. సొషల్ మీడియాలోనూ నెటిజన్స్ ‘వావ్’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మన వాడి అందం, ఆకర్షణ అలాంటివి మరి! అఫ్ కోర్స్, ఇందులో సస్పెన్స్ ఏం లేదు… కొణిదెల వారి మరో కొత్త స్టార్ కిడ్… ‘అకీరా’ గురించే! పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ తనయుడ్ని జనం చూడటం ఇదే మొదటిసారి కాకున్నా రీసెంట్ గా అకీరా హైట్ అండ్ లుక్స్ పదే పదే చర్చకొస్తున్నాయి! ఆ మధ్య నీహారిక పెళ్లి సందర్భంలోనూ జూనియర్ పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు!
పవన్ కళ్యాణ్ తో అకీరా నందన్ దిగిన ఒక ఫోటో ఇంటర్నెట్ లో బాగా చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ కంటే ఎత్తుగా ఉన్న అకీరా గురించి సహజంగానే పీకే ఫ్యాన్స్ సొషల్ మీడియాలో చర్చలు సాగిస్తున్నారు. అయితే, ఈ ఫోటో వెనుక మరో రహస్యం ఉందట. దానిపై కూడా ఫిల్మ్ నగర్ లో కొందరు మాట్లాడుకుంటున్నారు. పిక్ లో అకీరా మ్యూజిక్ టీచర్ ని కూడా మనం చూడవచ్చు. ఇంతకీ, సంగతేంటంటే… మన ‘గబ్బర్ సింగ్’ కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల వచ్చిన విరామాన్ని సంగీత సాధనకి వాడుతున్నాడట. అకీరాతో కలసి తానూ స్వర సాధన చేస్తున్నాడట.
పవన్ కళ్యాణ్ చిన్నతనంలో వయొలిన్ కొన్నాళ్లు నేర్చుకున్నాడట. అదే లవ్ ఫర్ మ్యూజిక్ ఇప్పుడూ కంటిన్యూ అవుతోంది. కరోనా నుంచీ ఆయన పూర్తిగా కోలుకోవటంతో ప్రస్తుతం పీకేకి కాస్త ఫ్రీ టైం దొరికింది. మరో వైపు లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ కూడా లేవు. అందుకే, తనయుడు, తాను ఇద్దరూ సంగీత సాధన చేస్తున్నారని సమాచారం. ఇక అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకి కాస్త టైం పట్టేలానే ఉంది కానీ… పవన్ కళ్యాణ్ మాత్రం త్వరలో హరీశ్ శంకర్, క్రిష్ సినిమాలు చేయాల్సి ఉంది.
తనయుడితో కలసి తన చిరకాల స్వప్నం సాకారం చేసుకుంటోన్న పవన్!
