NTV Telugu Site icon

Nidhhi Agerwal : మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన పవన్ హీరోయిన్ !

Nidhi Agarval (2)

Nidhi Agarval (2)

రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. తనదైన రీతిలో సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో మూవీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. సూర్యకి ముందు నుండి తెలుగులో సినిమా చేయాల‌ని కోరిక ఉంది. మంచి క‌థ దొరికితే చేస్తాన‌ని చాలా ఈవెంట్‌ల‌లో తెలిపాడు. కాగా ఇప్పుడు వెంకీ అట్లూరి ద‌ర్శక‌త్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ త్వర‌లోనే అధికారికంగా ప్రక‌టించ‌నున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ నిర్మించ‌బోతున్నట్లు స‌మాచారం.

Also Read: Saam : 15 సంవత్సరాల సినీ కెరీర్ కంప్లీట్ చేసుకున్న సమంత..

అంతే కాదు ఈ మూవీలో సూర్య వెనుకబడిన కులానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్నాడట. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందట. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉండగా, రెండో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రజంట్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర చాలా స్ట్రాంగ్ అని,ఓ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ మూవీ విడుదలకు ముందే నిధి వరుస అవకాశాలు అందుకుంటుంది.