సినీ స్టార్స్ కు ఎంతోమంది అభిమానులు ఉంటారు. వారికి తమ అభిమాన నటుడు, లేదా నటీమణి ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు ? ఏం చేస్తున్నారు ? వారికి ఇష్టమైనవి ఏంటి ? అని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. అయితే ఎంత డబ్బులు ఉన్నప్పటికీ నటీనటులు సాధారణ ప్రజలు తిన్నట్టుగా కడుపునిండా తినలేరు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డైటింగ్ పేరుతో ఇష్టమైన తిండికి దూరంగా ఉంటారు. ఇక ఫిజిక్‌ని బాగా మెయింటైన్ చేసే టాలీవుడ్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవన్ కు ఇష్టమైన వంటకాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పవన్ సీఫుడ్ ను అమితంగా ఇష్టపడతారట. అందులోనూ నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టమట. ఇంకా పవన్ కు నాటుకోడి చికెన్, పులిహోరాను కూడా అమితంగా ఇష్టపడతారట. కాగా కొన్ని వారాల క్రితం కరోనా బారిన పడ్డ పవన్ కళ్యాణ్ ఇటీవలే కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక పవన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
పవన్ ఫేవరేట్ వంటకాలేంటో తెలుసా ?
