Site icon NTV Telugu

Pawan Kalyan : టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్న వీరమల్లు టీమ్..!

Pawan Kalyan,hariharaveeramallu

Pawan Kalyan,hariharaveeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకులు క్రిష్ జాగర్లమూడి, అలాగే జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా, రిలీజ్‌కు సంబంధించి తర్జన భర్జనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం, చివరగా ప్రకటించిన జూన్ 12న కూడా రిలీజ్ చేయడం సందేహం గానే ఉంది. బిజినెస్ పరంగా తలెత్తిన కొన్ని ఇబ్బందులు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల సినిమా మరోసారి వాయిదా వేయక తప్పలేదు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Also Read : Vicky Koushal : మరో బయోపిక్‌ల్లో విక్కీ కౌశల్..

ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తీసుకున్న రూ.11 కోట్ల అడ్వాన్స్ వెనక్కి ఇవ్వడం కాకుండా. ఓవర్సీస్ మార్కెట్ లో ఇది వరకే బుకింగ్స్ చేసుకున్న ఆడియెన్స్‌కి కూడా టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వడం స్టార్ట్ అయ్యిందట. కానీ వాయిదా నిర్ణయం తీసుకోవడం కూడా సులువైన విషయం కాదు. ఎందుకంటే ఓటీటీ సంస్థకు హక్కులు అమ్మాకే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. భారీ మొత్తానికి డీల్ కుదిరింది. ఇక ఇప్పుడు వేరే కారణాలతో సినిమాను వాయిదా వేస్తే ఓటీటీ సంస్థ ఒప్పుకునే పరిస్థితి లేదు. డిజిటల్ రిలీజ్‌ స్లాట్ చూసుకున్నాకే ఓటీటీ సంస్థలు డీల్స్ చేసుకుంటాయి. చెప్పిన డేట్ దాటితే ఓటీటీ సంస్థ ముందుగా చేసుకున్న ఒప్పందం లో రూ.20 కోట్ల కోత విధిస్తుందట. అందుకే నిర్మాత ఏఎం రత్నం.. ఎలాగైనా జూన్ 12 కే సినిమాను తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట. చూడాలి మరి ఏం అవుతుందో.

Exit mobile version