టాలీవుడ్‌లో ప్లాప్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన మెహర్ రమేష్, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియా అంతా హీట్ అయ్యింది. చివరిగా మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ చిత్రం ఘోరంగా విఫలమైంది. మెహర్ తీసిన సినిమాల్లో ఇది ఒక పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆయన పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.
Also Read : Lokesh : నాగ్ సార్‌ని ఒప్పించడం చాలా కష్టం.. లోకేష్ కనగరాజ్ షాకింగ్ స్టేట్‌మెంట్!
దర్శకుడిగా తనపై ఉన్న నెగెటివ్ మార్క్ నుంచి ఇంకా తేరుకోకముందే, ఇప్పుడు పవన్‌తో సినిమా చేస్తానని ప్రకటించడం కలకలం రేపుతోంది. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్‌తో తీసిన బిల్లా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహర్ రమేష్, ఆ తర్వాత తీసిన సినిమాలు మాత్రం వరుసగా ఫెయిలయ్యాయి. దీంతో ఆయన దశాబ్దానికి పైగా డైరెక్షన్‌కు దూరంగా ఉన్నారు. చిరంజీవి సన్నిహితుడిగా ఉన్న మెహర్‌కు ‘భోళా శంకర్’ ఛాన్స్ వచ్చినా, అది కూడా తీవ్రంగా ఫెయిలయ్యారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మెహర్ రమేష్.. ‘‘చిరంజీవి గారితో సినిమా చేశాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో 100% సినిమా చేస్తాను’’ అంటూ స్పష్టంగా వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకుంటే, ఆయన మెహర్‌కి డేట్స్ ఇవ్వగలరా అన్నదానిపై సందేహాలే ఎక్కువ.
మెహర్ రమేష్ మెగా కుటుంబానికి బంధువు కావడం, చిరుతో ఉన్న అనుబంధం వల్ల ఆయనకు అవకాశాలు వస్తున్నాయని అనుకుంటున్నారు చాలామంది. కానీ గత ఫలితాలు చూస్తే, పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రకటనతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
