Site icon NTV Telugu

Pawan Kalyan : ‘సత్యాగ్రహి’ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

ప్రస్తుతం పవన్ కల్యాణ్ లైనప్ లో ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లతో పాటు, ‘హరిహర వీరమల్లు’ సినిమాలున్నాయి. ఇందులో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. కాగా పార్ట్‌-1 జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ థర్డ్‌ సింగిల్‌ అసుర హననం లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఒక యోధుడు పైకి వస్తాడు. ఒక వారసత్వం ప్రారంభమవుతుంది. ధర్మం కోసం యుద్ధం ప్రారంభం కానుంది.. అంటూ విడుదల చేసిన ఈ పాట గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఇందులో భాగంగా ఈ మూవీ నిర్మాత ఏఏమ్ రత్నం మాట్లాడుతూ.. గతంలో పవన్ తో అనుకున్న‘సత్యాగ్రహి’ సినిమా ఆగిపోవడానికి గల కారణం తెలిపారు.

Also Read : Balagam : బలగం సినిమా రిపీట్.. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచిన అన్నదమ్ములు..

పవన్ కళ్యాన్ కెరీర్ లో చాలా సినిమాలు సెట్స్ మీదకు వెళ్లి ఆగిపోయాయి. అందులో ‘సత్యాగ్రహి’ కూడా ఒకటి. ఏఎమ్ రత్నం నిర్మాణ సారధ్యంలో ఘనంగా ఈ సినిమా ప్రారంభమైనప్పటి ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ అదే ఏఏమ్ రత్నం తో పవన్ ‘బంగారం’ సినిమా తీశాడు. అయితే తాజాగా ‘హరిహర వీరమల్లు’ పాట రిలీజ్ ఈవెంట్ లో ఏఏమ్ రత్నం మాట్లాడుతూ ‘నిజానికి సత్యాగ్రహి సినిమాను పవన్ చాలా ఇష్టంగా ప్రారంభించారు. కానీ పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది’ అని క్లారిటీ ఇచ్చారు రత్నం.

Exit mobile version