NTV Telugu Site icon

Pawan Kalyan: ఆగిపోయిన సినిమా మళ్లీ మొదలైంది!

Ustad

Ustad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా ఆగిపోయిన సినిమాలు ఇటీవల తిరిగి షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. వాటిలో ముందుగా హరిహర వీరలమల్లు సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నారు. అందుకోసమై ఆ మధ్య విజయవాడలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సీన్స్ చిత్రీకరించారు. కదర్శకుడు క్రిష్ మధ్యలో వదిలేసిన ఈ సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పవర్ స్టార్ నటిస్తున్న మరో సినిమా ఓజి ( OG ).యంగ్ డైనమిక్ సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. తమిళంలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా తేరికి ఉస్తాద్ భగత్ సింగ్ అఫీషియల్ రీమేక్. కానీ కేవలం మూల కథను మాత్రమే తీసుకుని పవన్ ఇమేజ్ కు తగ్గట్టు మారుస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. కానీ ఈ సినిమాను పవన్ పక్కన పెట్టేసాడని, ఇక ఈ సినిమా రాదని, హరీష్ శంకర్ లేటెస్ట్ సినిమా ప్లాప్ కావడంతో మేకర్స్ పవన్ సినిమాను మధ్యలోనే ఆపేశారని టాక్ వినిపించింది. కానీ అవేవి నిజం కాదు. తాజాగా ఈ సినిమా వర్క్ ను స్టార్ట్ చేసాడు హరీష్ శంకర్. ఈ సినిమాకు ఒకప్పుడు సంతోషం, MR. పర్ఫెక్ట్ వంటిహిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దశరధ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Show comments