Site icon NTV Telugu

HHVM : నిది అగర్వాల్ కష్టం చూసి నాకే సిగ్గేసింది : పవన్ కళ్యాణ్

Veramalu Press Meet

Veramalu Press Meet

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాకు నిర్మాతగా ఏఎం రత్నం వ్యావహరించగా, క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.  నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ మూవీ నుండి, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఒక తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొనడం అభిమానులకు ఓ పండుగలా మారింది. మీడియా ముందుకు చాలా కాలం తర్వాత వచ్చిన పవన్, తన రావాడానికి గల కారణాన్ని అద్భుతంగా వివరించాడు.

Also Read : Nikhil : సినిమా కన్నా స్నాక్స్ ఖరీదు ఎక్కువ.. మల్టీప్లెక్స్ దందా పై నిఖిల్ కౌంటర్

“ఈ ప్రెస్ మీట్ నేను నిర్మాత కోసం నిర్వాహించాను. ఏఎం రత్నం చూట్టు ఒక్కప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలు, హీరోలు తిరిగే వారు కానీ .. ప్రజంట్ ఆయన బాధ చూసి తట్టుకోలేక పోయా. ఆయన కోసం సినిమాకు ఓకే చెప్పాను,” అని చెప్పిన పవన్, ఇండస్ట్రీ ఎదుర్కొన్న కష్టాలు, కరోనా తర్వాత మారిన పరిస్థితుల గురించి కూడా చెప్పాడు. అయితే ఈ సందర్భంలో పవన్ ప్రత్యేకంగా నిధి అగర్వాల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. “సినిమా పూర్తయిన తర్వాత కూడా నిధి ఒక్కసారి కూడా విరామం లేకుండా ప్రమోషన్లలో పాల్గొంటోంది. వరుస ఇంటర్వ్యూలు చేస్తూ, ఈ మూవీ బాధ్యతను తన భుజం మీద వేసుకుంది. ఇది చాలా గొప్ప విషయం” అంటూ నిధి డెడికేషన్‌ను ప్రశంసించాడు.

Exit mobile version