Site icon NTV Telugu

DVV Entertainment: ట్విట్టర్లో కౌంటర్.. డీవీవీ నిర్మాణ సంస్థపై కేసు

Og Review

Og Review

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘OG’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టి పిటిషనర్ అడ్వకేట్ బర్ల మల్లేష్ యాదవ్‌ను కించపరిచినట్టు ఆయన ఆరోపణలు చేశాడు. ఈ ఘటనపై తీవ్రంగా తప్పుబట్టిన మల్లేష్ యాదవ్, ఆ సంస్థకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు పంపుతున్నానని, లీగల్ నోటీసులు జారీ చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు.

Also Read:Shefali Jariwala: షెఫాలీ చనిపోయిన రోజు.. ఏం జరిగిందో నిజం బయటపెట్టిన భర్త పరాగ్

పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్, ఎమ్రాన్ హష్మీలు ప్రధాన పాత్రలలో నటించిన ‘OG’ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బానర్‌లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాణంలో సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కింది. సెప్టెంబర్ 19న తెలంగాణ ప్రభుత్వ హోం డిపార్ట్‌మెంట్ మెమో జారీ చేసి, స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ప్రీమియర్ షోలకు రూ.800 వరకు ధరలు ఉండవచ్చని పేర్కొంది. ఈ మెమోపై అడ్వకేట్ బర్ల మల్లేష్ యాదవ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆర్డర్ చట్టవిరుద్ధమని, రాజ్యాంగం 14వ, 246వ విధులకు విరుద్ధమని వాదించారు. ఈ పిటిషన్ విచారించి, సెప్టెంబర్ 25న మెమోను సస్పెండ్ చేసి, ప్రభుత్వ, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు నోటీసులు జారీ చేశారు. తీర్పు తేదీ అక్టోబర్ 9కు ఆదేశించారు. దీనికి అసంతృప్తి చెందిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది.

Also Read:Raja Saab: రెబల్ ఫాన్స్ కి ముందుగానే పండుగ!

అక్కడ కూడా హైకోర్టు ఈ టికెట్ ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. సెప్టెంబర్ 26న డివిజన్ బెంచ్ విచారణ సమయంలో హైకోర్టు తీర్పు రాత్రి 11:30 గంటల సమయంలో రావచ్చని తెలిసినప్పటికీ, అంతకు ముందే డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ అధికారిక X ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లో మల్లేష్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని, “నైజాం ఏరియాలో ఎక్కడైనా మల్లేష్ యాదవ్‌కు రూ.100కే ‘OG’ టికెట్ ఇస్తాము” అంటూ కామెంట్ చేశారు. ఈ పోస్ట్ వల్ల ట్రోలర్స్ తనని టార్గెట్ చేశారని మల్లేష్ యాదవ్‌ ఆరోపించాడు. హైకోర్టు తీర్పు ముందే ఇలా చేయడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించినది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకు కంటెంప్ట్ కింద నోటీసులు పంపిస్తున్నాను. లీగల్ నోటీసులు జారీ చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేస్తాను” అంటూ స్పష్టం చేశారు.

Exit mobile version