NTV Telugu Site icon

Pawan kalyan : సాయి ధరమ్ తేజ్ మీద సీసా విసిరారు.. తలకి తగిలితే?

Whatsapp Image 2024 05 11 At 8.29.55 Am

Whatsapp Image 2024 05 11 At 8.29.55 Am

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం మీదే వుంది.ఈ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.గత పవన్ కల్యాణ్ఎన్నికలలో భీమవరం ,గాజువాక రెండు నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయారు.ఈ సారి జనసేన పార్టీ బీజేపీ ,టీడీపీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీలోకి దిగింది.దీనితో ఈ సారి పవన్ గెలుపు ఖాయమని జన సైనికులు భావిస్తున్నారు .

పవన్ కల్యాణ్ కోసం పలువురు టాలీవుడ్ ప్రముఖులు పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ కూడా పవన్ కోసం జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.రీసెంట్ గా మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ ,వైష్ణవ తేజ్,సాయిధరమ్ తేజ్ ప్రచారంలో పాల్గొన్నారు .అయితే సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతనిపై బాటిల్ ను విసిరారు..కానీ అది గురి తప్పి పక్కన వున్న తెలుగు దేశం కార్యకర్తకు తగిలింది .ఈ విషయంపై స్పందించిన పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై, కార్యకర్తలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు .సాయిధరమ్ తేజ్ నా మీద వున్న ప్రేమతో ప్రచారానికి వచ్చాడు.రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిపై దాడి చేస్తారా అదే బాటిల్ తలకి తగిలి ఉంటే ఏమై ఉండేది అని పవన్ మండిపడ్డారు.అలాగే గాయపడిన తెలుగు దేశం వ్యక్తి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.