పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ అంటూ పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపేస్తున్నాడు ప్రముఖ రచయిత. తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి మాధవ్ బుర్రా ఒక ప్రముఖ స్క్రీన్ రైటర్. టాలీవుడ్ సూపర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణల కోసం “ఖైదీ నెం 150”, “గౌతమిపుత్ర శాతకర్ణి” సినిమాలకు ఆయన డైలాగ్స్ రాశారు. సాయి మాధవ్ బుర్రా టెలివిజన్ రచయితగా తన వృత్తిని ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో ప్రసిద్ధ డైలాగ్ రైటర్. ప్రస్తుతం ఆయన ఎస్.ఎస్.రాజమౌలి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” కోసం డైలాగ్ రైటర్ గా పని చేస్తున్నారు, ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా సాయి మాధవ్ బుర్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “హరి హర వీర మల్లు” గురించి మాట్లాడారు.
Read Also : మహేష్ “సరిలేరు నీకెవ్వరు”… హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ !
సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ “హరి హర వీరమల్లు నెక్స్ట్ లెవెల్ మూవీ. దీనికి అద్భుతమైన కథ ఉంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు తమ కాలర్‌ను పైకి ఎగరేస్తారు. గర్వంతో వారి చేతులను తమ హృదయాలపై ఉంచవచ్చు. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను” అంటూ సినిమాపై అమాంతంగా హైప్ పెంచేశారు. కాగా “హరి హర వీరమల్లు” ద్వారా పవన్‌కళ్యాణ్, క్రిష్ కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.