Site icon NTV Telugu

Pawan Kalyan Birthday: మెగాస్టార్ కి దెబ్బ.. మరి ‘తమ్ముడు’ పరిస్థితేంటి..?

Pawan

Pawan

Pawan Kalyan Birthday: ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త సినిమాల సంగతేమో కానీ, రీ రిలీజ్ ట్రెండ్ మాత్రం గట్టిగా నడుస్తోంది. అయితే.. ఆ మధ్య రీ రిలీజ్ అయిన సినిమాలు భారీ కలెక్షన్స్ రాబట్టాయి. కానీ ఈ మధ్య రిలీజ్ అవుతున్న సినిమాలకు గట్టి ఎదురు దెబ్బ తగులుతోంది. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ‘అతడు’ సినిమాను గ్రాండ్‌గా రీ రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా పెట్టిన రైట్స్ కూడా రికవరీ చేయలేకపోయింది. ఇక లేటెస్ట్‌గా మెగాస్టార్ సినిమా కూడా రీ రిలీజ్ అయిన సంగతే తెలియకుండానే.. థియేటర్లోకి వచ్చినట్టుగా అయింది వ్యవహారం. ఈసారి చిరు బర్త్ డేకి నాలుగు కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చాయి. విశ్వంభర, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల గ్లింప్స్‌తో పాటు.. బాబీ, శ్రీకాంత్ ఓదెల సినిమాల అప్డేట్స్ వచ్చాయి.

Read Also: Heavy Rains: ఉత్తరాంధ్ర లో దంచికొడుతున్న వానలు

అలాగే, స్టాలిన్ సినిమాను 4K వెర్షన్‌లో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ, రెస్పాన్స్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. కొన్ని షోలకు మాత్రమే డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది. చాలా చోట్ల షోలు మొదలవ్వక ముందే క్యాన్సిల్ కూడా అయ్యాయి. మరి ఇలాంటి సమయంలో పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా.. సెప్టెంబర్ 2వ తేదీన రెండు సినిమాలు రీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ‘తమ్ముడు’ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే, గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు కూడా ‘జల్సా’ను రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలు గతంలోనే పలుమార్లు రీ రిలీజ్ కాగా.. మరి ఈసారి ఎలా సందడి చేస్తాయో చూడాలి.

Exit mobile version