NTV Telugu Site icon

Pawan Kalyan: మహకుంభమేళాలో పుణ్యస్నానం చేసిన పవన్ దంపతులు

Pawan Kumbh

Pawan Kumbh

ప్రయాగ్ రాజ్‌ మహకుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు పుణ్యస్నానం చేశారు. ఈ సందర్భంగా గంగానదికి పవన్ కళ్యాణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి పవన్ కళ్యాణ్ దంపతులు హారతి ఇచ్చారు. పితృదేవతలకు తర్పణాలు వదిలి, బ్రాహ్మణులకు వస్త్ర దానం చేశారు. ఇది మనందరికీ గొప్ప అవకాశం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మనం భాష లేదా సంస్కృతి విషయంలో భిన్నంగా ఉండవచ్చు, కానీ ఒక మతంగా, మనం అంతా ఒక్కటే. మహా కుంభమేళాను నిర్వహించినందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి రావాలనేది చాలా దశాబ్దాలుగా నాకున్న అతిపెద్ద కోరిక. ఈరోజు, నాకు ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు.

Manchu Manoj: మంచు మనోజ్ కంటికి గాయం?

మహా కుంభమేళాలో భక్తుల ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం నాడు కూడా దాదాపు 1.35 కోట్ల మంది స్నానాలు చేశారు. ఇప్పటివరకు 54.31 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా నుండి భక్తులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మరోవైపు, మహా కుంభమేళా మీదుగా ప్రతి గంటకు 8 కి పైగా విమానాలు ఎగురుతున్నాయి. ఈ క్రమంలో విమానయాన సంస్థలు తమ ప్రయాణీకులకు ఏరియల్ వ్యూ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నాయి.